భారత బాడ్మింటన్ పీవీ సింధుకు ఈరోజు కొరియన్ ఓపెన్‌ ఆరంభంలోనే నిరాశ ఎదురైంది. అమెరికాకి చెందిన జంగ్ బీవెన్‌ చేతిలో సింధు ఓడిపోయింది. దీంతో ఆమె తొలి రౌండ్‌లోనే ఈ టోర్నమెంటు నుంచి నిష్క్రమించింది. బీవెన్‌పై 21-7, 22-24, 15-21 తేడాతో సింధూ ఓటమి పాలైంది. తొలి రౌండ్‌లో పీవీ సింధూ ధాటిగా ఆడి పైచేయి సాధించినప్పటికీ, రెండో రౌండ్‌లో బీవెన్ విజృంభించడంతో వెనుకబడింది. మూడో రౌండ్‌లోనూ అమెరికా క్రీడాకారిణి ధాటిగా ఆడుతూ సింధును ప్రతిఘటించింది. దీంతో చివరి రెండు రౌండ్లలో సింధుకి ఓటమి తప్పలేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.