అనంత‌పురంలో అసెంబ్లీని ఏర్పాటు చేయండి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Dec 2019 6:12 AM GMT
అనంత‌పురంలో అసెంబ్లీని ఏర్పాటు చేయండి..!

అనంతపురం జిల్లాలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని కదిరి ఎమ్మెల్యే (వైసీపీ) పీవీ సిద్దారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం కదిరిలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. అమరావతిని లక్ష కోట్లు పెట్టి రాజధానిగా అభివృద్ధి చేసే కంటే.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే చాలా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడంలో భాగంగా.. అనంతపురంలో అసెంబ్లీ ఏర్పాటు చేసి, శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దీంతో పాటు వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు కూడా ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు.

Next Story
Share it