బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప సంస్కరణ శీలి, 360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు అని.. ఆయన లాంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందని అన్నారు సీఎం కేసీఆర్ అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేశవరావు, బొంతురామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.