వామ్మో పీవీ ఫ్లై ఓవర్‌

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 26 Sept 2019 7:54 PM IST

వామ్మో పీవీ ఫ్లై ఓవర్‌

హైదరాబాద్‌: ఇటీవల అమీర్‌ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన ప్రమాదంతో నగరవాసులు వణికిపోతున్నారు. ఫ్లై ఓవర్లు, మెట్రో కట్టడాలపై అనుమానాలు మొదలయ్యాయి. సినీ రచయిత కోన వెంకట్ సామాజిక బాధ్యతగా వ్యవహారించారు. పీవీ నరసింహరావు ప్లై ఓవర్‌ పిల్లర్ నంబర్ 20 దగ్గర పరిస్థితిని ఫొటో తీసి ట్విట్ చేశారు. పెచ్చులూడి, నెర్రలిచ్చిన ఫ్లే ఓవర్‌ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అధికారులకు కనువిప్పు కలిగించారు. అంతేకాదు..కేటీఆర్‌, జీహెచ్‌ఎంసీలకు ట్యాగ్ చేశారు. మరి కోన ట్విట్ పై ప్రభుత్వం, అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.

Next Story