రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తమిళనాడుకు రాబోతున్నారు. అక్కడ జరిగే జల్లికట్టును వీక్షించబోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది పుతిన్ తమిళనాడు పర్యటన జరగనుంది. జల్లికట్టు క్రీడకు తమిళనాడు ప్రసిద్ది. ఏటా పొంగల్ సందర్భంగా తమిళనాట జల్లికట్టు ఆడుతారు. ముఖ్యంగా మధురై సమీపంలోని అనంగనల్లూరులో జరిగే జల్లికట్టు వేడుకలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. ఈ నేపథ్యంలో జల్లికట్టును చూడడానికి పుతిన్ వస్తారని సమాచారం. 2020 జనవరిలో అనంగనల్లూరులో పొంగల్ ఉత్సవాల్లో పుతిన్ పాల్గొంటారని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.

అయితే..చైనా ప్రెసిడెంట్ పింగ్ తరువాత స్వల్పకాలంలోనే మరో అంతర్జాతీయ అగ్రనేత పుతిన్ తమిళనాడులో అడుగు పెడుతుండటం గమనార్హం.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story