డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు ఈ రోజు ( సెప్టెంబ‌ర్ 28). ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్స‌స్ తో మ‌ళ్ళీ ఫామ్ లోకి వ‌చ్చిన పూరి ఈ స‌క్స‌స్ ని ఎంజాయ్ చేస్తూ… పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ మంచి ప‌నికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. సినిమానే న‌మ్ముకుని ప్ర‌స్తుతం ప‌ని లేక ఖాళీగా ఉన్న ద‌ర్శ‌కులు, కో – డైరెక్ట‌ర్స్ 30 మందికి ఒక్కొక్క‌రికి 50,000 వేలు చొప్పున ఈ రోజు ఆర్ధిక స‌హాయం చేసారు. ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగిన పూరి జ‌న్మ‌దిన వేడుక‌ల్లో ఛార్మి ఈ చెక్స్ ను అంద‌చేసారు.

పూరి జ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే ఈవెంట్ పిక్స్

అయితే… పూరి మాత్రం ఈ వేడుక‌కు రాలేదు. ఇంత‌కీ.. పూరి ఎక్క‌డున్నారు అని ఆరా తీస్తే… తెలిసింది ఏంటంటే… ప్ర‌స్తుతం పూరి గోవాలో ఉన్నారు. సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫైట‌ర్ అనే సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకి సంబంధించిన క‌థ పై క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. హీరోల‌ను డిఫ‌రెంట్ గా ప్ర‌జెంట్ చేసే పూరి… విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కూడా స‌రికొత్త‌గా చూపించ‌నున్నార‌ట‌. ఈ భారీ చిత్రాన్ని పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మించ‌నున్నారు.

Image result for vijay devarakonda puri jagannath

జ‌న‌వ‌రి నుంచి షూటింగ్ ప్రారంభించి స‌మ్మ‌ర్ లో ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో మ‌ళ్లీ స‌క్స‌స్ ట్రాక్ లోకి వ‌చ్చిన పూరి విజ‌య్ తో చేయ‌నున్న సినిమాతో కూడా సక్స‌స్ సాధిస్తార‌ని ఆశిస్తూ… హ్యాపీ బ‌ర్త్ డే & ఆల్ ది బెస్ట్ టు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్..!

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.