ఆ విషయంలో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ
By తోట వంశీ కుమార్
విజయ్‌దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాకి 'ఫైటర్' .. 'లైగర్' అనే టైటిల్స్ ను పరిశిలీస్తున్నారు. కరోనా మహమ్మారి ధాటికి ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రంలో విజయ్ మంచి ఫిట్‌నెస్‌తో కనిపించనున్నాడు. అందుకోసం ఇప్పటికే పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అయితే.. ప్రస్తుతం లాక్‌డౌన్ తో జిమ్‌లు మూతపడిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఎక్కడైనా అందుబాటులో ఉన్నా ఉపయోగించలేని పరిస్థితి ఉంది.
ఇదిలా ఉంటే.. చాలా మంది హీరోలు తమ ఇంట్లోనే జిమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. విజయ్ దేవరకొండ ఇంకా తన ఇంట్లో జిమ్ సెట్ చేసుకోలేదు. అందువల్ల వర్కౌట్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడట. సినిమా షూటింగ్ మళ్లీ మొదలైయ్యే వరకు కూడా ఫిట్‌నెస్ కాపాడుకోవాల్సి ఉంది. దీంతో విజయ్ కి ఏం చేయాలో పాలుపోవడం లేదట. విజయ్ ఫిట్ నెస్ విషయంలో తేడా వస్తే, షూటింగు వాయిదా పడే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.