సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. ఆఫర్లు విని షాకైన పోలీసులు

By సుభాష్  Published on  6 Feb 2020 10:41 AM GMT
సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. ఆఫర్లు విని షాకైన పోలీసులు

దేశ వ్యాప్తంగా వ్యభిచార ముఠాలు బరితెగిస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న వ్యభిచార దందాలను అంతమొందించేందుకు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నా.. ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ముఠాలు మహిళలను ఆసరాగా చేసుకుని వ్యభిచార కూపంలోకి లాగుతూ వారి విలువైన జీవితాలను నాశనం చేస్తున్నారు. స్వదేశీ అమ్మాయిలతో పాటు విదేశాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొచ్చి దందాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో పోలీసులు ఓ సెక్స్‌ రాకెట్‌ను గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా విటులు, నిర్వాహకులను అరెస్టు చేసి, పలువురు అమ్మాయిలను రక్షించారు. పట్టుబడిన యువతుల్లో విదేశీ యువతులు ఉండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా, షాకింగ్‌ నిజాలు బయటపడ్డాయి. విటులను ఆకర్షించేందుకు నిర్వాహకులు బంపర్‌ ఆఫర్‌ కూడా ప్రకటిస్తున్నారట.

విదేశీ యువతిని బుక్‌ చేసుకుంటే ఓ స్వదేశీ యువతి ఫ్రీగా పడక సుఖం అందిస్తారట. పట్టుబడిన విటులు ఈ విషయాన్ని బయటపెట్టడంతో పోలీసులు షాకయ్యారు. వ్యభిచారం నిర్వహించే ముఠాలు రష్యా, ఉక్రెయిన్‌, సెర్బియా దేశాల నుంచి అమ్మాయిలను విజిటింగ్‌ వీసాలపై తీసుకొచ్చి వ్యభిచారం దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి ఫోటోలను సైతం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ విటులను ఆకర్షించి భారీ మొత్తంలో డబ్బులు లాగుతున్నట్లు తేలింది.

సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని చెప్పి వ్యభిచారంలోకి..

పుణె నగరానికి చెందిన సోనీ (36) అనే మహిళ ఈ సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె నగరంలోని ప్రముఖ హోటళ్లలో గదులను అద్దెకు తీసుకుని వ్యభిచారం దందా నిర్వహిస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని యువతులను నమ్మించి వ్యభిచారం చేయిస్తోన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితురాలిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Next Story
Share it