ముగ్గురు భారతీయులకు అత్యున్నత పురస్కారం

By సుభాష్  Published on  5 May 2020 11:25 AM GMT
ముగ్గురు భారతీయులకు అత్యున్నత పురస్కారం

అమెరికాలో జర్నలిజం, సాహిత్యం, సంగీతంలో ఇచ్చే అత్యున్నత అవార్డులు పులిట్జర్ పురస్కారాలను మే4వ తేదీన ప్రకటించారు. అయితే జర్నలిజంలో ఇండియాకు చెందిన చెందిన ముగ్గురు ఫోటో గ్రాఫర్లకు ఈ పులిట్జర్ పురస్కారం వరించింది. అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఫోటో గ్రాఫర్స్‌ ముక్తార్‌, చన్నీఆనంద్‌, దార్‌ యాసిన్‌లు జమ్మూకశ్మీర్‌ కవరేజ్‌ కోసం ఫీచర్‌ ఫోటోగ్రఫీ అవార్డును దక్కించుకున్నారు.

గత ఏడాది జమ్మూకశ్మీర్‌ లోయలో ఆర్టికల్‌ 370ని తొలగించిన సమయంలో జరిగిన హింసాకాండలపై ఫోటో గ్రఫర్లు తమ కెమెరాలో పలు చిత్రాలను బంధించారు. దీంతో వారికి ఈ పురస్కారం లభించింది.

కాగా, ఈ ముగ్గురిలో ముక్తార్‌, యాసిన్‌ శ్రీనగర్‌లో ఉంటుండగా, ఆనంద్‌ జమ్మూలో నివసిస్తున్నారు. ఈ ముగ్గురు ఫోటోగ్రాఫర్లు అక్కడి నిరసనలు, భద్రతా దళాలకు సంబంధించిన ఫోఓలను కెమెరాలో బంధించి ప్రపంచానికి చూపించారు.

Next Story