భాగ్యనగరంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు

By రాణి  Published on  30 Dec 2019 7:45 AM GMT
భాగ్యనగరంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్ పల్లి సన్ రైజ్ కాలనీలో జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లకు చెందిన ఆరుగురు అమ్మాయిలతో పాటు నలుగురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకుని రాజేంద్ర నగర్ పీఎస్ కు తరలించారు. ఇమ్రాన్, దీపక్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ వ్యభిచార దందాను నడిపిస్తున్నట్లు సమాచారం. పట్టుబడిన వారి నుంచి పోలీసులు 6 సెల్ ఫోన్లు, మూడు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

గతంలో చాలా సార్లు హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచారం చేస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. వ్యభిచార వృత్తి నేరపరమైందని చెప్తున్నా రోజురోజుకీ ఇలాంటివి పెరుగుతూనే ఉంటున్నాయి తప్ప తగ్గడం లేదు. అంతేకాక మన దేశం నుంచి ఇతర దేశాలకు అమ్మాయిలను అమ్మేసి లబ్ధి పొందుతున్నారు కొందరు. అలాంటివారిలో 30 శాతం కేసులను పోలీసులు చేధించగలుగుతున్నారు. మిగతా 70 శాతం మంది అమ్మాయిలను గుట్టు చప్పుడు కాకుండానే సముద్రాలను దాటించేస్తున్నారు. ముఖ్యంగా కన్నె పిల్లలే వీళ్ల టార్గెట్. కనీరం పదహారణాలు కూడా నిండని అమ్మాయిలే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆడపిల్లలను కనడమే భారమని కొందరు కడుపులోనే కన్నుమూయించేస్తుంటే..మరికొంతమంది తల్లిదండ్రులు వయసుకొచ్చిన కూతుర్ని డబ్బుకు ఆశపడి అమ్మేసుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మన దేశ అభివృద్ధి ఎటుపోతుందో..?

Next Story
Share it