బోటు పై కప్పు వెలికితీసిన సత్యం బృందం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 11:33 AM GMT
బోటు పై కప్పు వెలికితీసిన సత్యం బృందం

కచ్చులూరు: మునిగిపోయిన బోటు వెలికితీతలో పురోగతి సాధించారు సత్యం బృందం. బోటు పై కప్పును బయటకు తీశారు. రెండు రోప్‌లు కట్టి బయటకు బోటు తీస్తామని మొదటి నుంచి సత్యం బృందం చెబుతూనే ఉంది. అన్నట్లుగానే రెండు రోప్ లు కట్టి బోటును ఒడ్డుకు లాగేందుకు యత్నిస్తున్నారు. తీనిలో పురోగతి కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ రాత్రికి కాని..రేపటికిగాని బోటును బయటకు తీసే అవకాశముంది. గోదావరి నీటి ఉధృతి కూడా తగ్గడంతో బోటును తీసేందుకు స్పీడ్‌గా ప్రయత్నిస్తున్నారు. రాయల్ వశిష్ట్ బోటు వెలికితీత పనులు అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాకినాడ పోర్ట్ అధికారి ఆదినారాయణ బోటు వెలికితీత పనులు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఆరు సార్లు గోదావరి గర్భంలోకి డైవర్లు వెళ్లారు. బోటు బాగా బురదలో కూరుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

Next Story
Share it