చిత్ర నిర్మాణంలోకి.. శోభారాణి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Nov 2019 8:32 AM GMT
చిత్ర నిర్మాణంలోకి.. శోభారాణి

ఎస్‌.వి.ఆర్ మీడియా బ్యాన‌ర్‌పై త‌మిళంలో విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల‌ను తెలుగులోకి అనువ‌దించిన నిర్మాత శోభారాణి. ఇప్పుడు నిర్మాణ సంస్థ ఎస్‌.వి.ఆర్‌.మీడియా కొత్త టర్న్ తీసుకుంది. ఈ సంస్థ ఇప్పుడు తెలుగులో నేరుగా సినిమాల‌ను నిర్మించ‌నుంది.

ఈ నేపథ్యంలోనే 2020లో ఐదు సినిమాల‌ను ఎస్‌.వి.ఆర్ మీడియాలో నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు శోభారాణి. యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ యంగ్ హీరోలు, హీరోయిన్‌ల‌తో పాటు కొత్త వారితో ఈ సినిమాల‌ను నిర్మించ‌డానికి ఎస్‌.వి.ఆర్ మీడియా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా కొత్త న‌టీన‌టులు, టెక్నీషియన్స్ కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా..ఎస్‌.వి.ఆర్ మీడియా అధినేత్రి శోభారాణి మాట్లాడుతూ..

"ఇప్ప‌టి వ‌ర‌కు మేం అనువాద సినిమాల‌తో మాత్రమే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ద‌గ్గ‌రయ్యామని.. ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాల‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా 2020లో ఐదు సినిమాల‌ను నిర్మింస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా యంగ్ హీరోలు, హీరోయిన్‌ల‌తో పాటు కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌బోతున్నామని తెలిపారు.

అయితే ఇప్ప‌టికే ఐదు సినిమాల‌కు సంబంధించిన స్క్రిప్ట్స్ సిద్ధ‌ంగా ఉందన్నారు. అందుకోసం ఆస‌క్తిగ‌త న‌టీన‌టులు(హీరో, హీరోయిన్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్స్‌), సాంకేతిక నిపుణులకు ఆహ్వానం ప‌లుకుతున్నట్లు.. ఆస‌క్తిగ‌ల‌వారు starmaking2020@gmail.com or to the WhatsApp no.s 9000910979 – 9133673367 ల‌కు వారి ప్రొఫైల్స్‌ను పంపాల్సిందిగా కోరారు. ఆస‌క్తి, నైపుణ్యం గ‌ల న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు ఇదొక మంచి ప‌రిణామంగా భావిస్తున్నాం" అని అన్నారు.

Next Story