రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ..

By Newsmeter.Network  Published on  27 Feb 2020 9:31 AM GMT
రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ..

రెండో టెస్టుకు ముందు టీమిండయాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ పృధ్వీ షా గాయం కారణంగా రెండో టెస్టులో ఆడేది అనుమానంగా మారింది. గురువారం భారత ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ సెషన్‌ను నిర్వహించారు. అందులో పృధ్వీ షా పాల్గొనలేదు. ఎడమ పాదం వాపుతో పృధ్వీ బాధపడుతున్నట్లు సమాచారం. గాయం తీవ్రత గురించి ఇప్పుడే చెప్పలేమని టీమిండియా మేనేజ్‌మెంట్ చెప్పింది. వైద్యులు పరీక్షిస్తున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే.. గురువారం నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో శుభ్‌మన్‌ గిల్ తీవ్రంగా సాధన చేశాడు. కోచ్‌ రవిశాస్త్రి శుభమన్‌ వద్దకు పదే పదే వెళ్లి పలు సూచనలు ఇచ్చాడు. దీంతో శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి శుభ్‌మన్‌ గిల్ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా మొదటి టెస్టులో షా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరాడు. కాగా.. ఒకవేళ షా.. శుక్రవారం కల్లా కోలుకుంటే మాత్రం టెస్టుల్లో ఆరంగ్రేటానికి శుభ్‌మన్‌గిల్ మరికొంత కాలం నిరీక్షించక తప్పదు. భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మొదటి టెస్టు అనంతరం మాట్లాడుతూ.. పృధ్వీ షా హిట్టింగ్‌ సామర్ధ్యంపై తమకు నమ్మకం ఉందని చెప్పిన విషయం తెలిసిందే.

మొదటి టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. శనివారం క్రైస్‌చర్చ్‌ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఆరాటపడుతోంది టీమిండియా.

Next Story