అక్కడ ఖైదీలు ఇడ్లీలు అమ్ముతారు..!రూ.5లకు 4ఇడ్లీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 4:13 PM GMT
అక్కడ ఖైదీలు ఇడ్లీలు అమ్ముతారు..!రూ.5లకు 4ఇడ్లీ..!

మహబూబ్ నగర్: అల్పాహారంతో పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో మహాబూబ్ నగర్ జైలు ఖైదీలు మై నేషన్ క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఐదు రూపాయలకు నాలుగు ఇడ్లీలు విక్రయిస్తున్నారు. ఈ క్యాంటీన్ జిల్లా జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ మార్గ దర్శకత్వంలో మొదలుపెట్టారు. జిల్లా కలెక్టర్ డీ రోనాల్డ్ రోజ్, జైళ్ల శాఖ డీఐజీ భాస్కర్ లు ప్రారంభించారు.

టిఫిన్ సెంట్ ఉదయం 6 నుండి 11 గంటల వరకు నడుస్తుంది. 1,500 ప్లేట్ల ఇడ్లీలను విక్రయిస్తారని అధికారులు చెబుతున్నారు. తినుబండారాలకు ప్లాస్టిక్‌ వాడకాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. పార్శిల్‌ల కోసం టిఫిన్ బాక్స్‌లను తీసుకురావాలని వినియోగదారులను కోరుతున్నామని తెలిపారు. కస్టమర్లకు నాణ్యమైన ఇడ్లీలను స్టీల్ ప్లేట్లలో వడ్డిస్తున్నారు. శుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే పనిచేసేటప్పుడు శిరోజాలు పడకుండా తలకు కాప్స్ పెట్టుకుంటున్నారు. ఆహార పదార్ధాలు మలినం కాకుండా చేతి తొడుగులు కూడా ధరించి జైలు ఖైదీలు పనిచేస్తున్నారు.

క్యాంటీన్ లాభాపేక్షలేని సంస్థ అని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా సమీపంలో నివసించే పేదలకు, కార్మికులకు ఆహారం అందించే సదుద్దేశంతో ప్రారంభించామన్నారు. కస్టమర్లకు మంచి టిఫెన్ అందించడమే తమ లక్ష్యమన్నారు జైలు అధికారులు, ఖైదీలు.

Image

Image

Image

Image

Image

Image

Image

Image







Next Story