సౌదీలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 8:17 AM GMT
సౌదీలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం

రియాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ తెల్లవారుజామున సౌదీ అరేబియాకు చేరుకున్నారు. అక్కడి మంత్రులు, ఉన్నాతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉన్నత స్థాయి ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ తో భేటీ కానున్నారు. అనంతరం అగ్ర నేతలిద్దరూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల్లో..ఓ నూతన శకానికి నాంది పలుకుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ పర్యటనలో చమురు, గ్యాస్‌, పౌర విమానయానం వంటి రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

Next Story