బాలయ్య కోసం మలయాళీ ముద్దుగుమ్మ..!

By సుభాష్  Published on  17 Oct 2020 12:14 PM IST
బాలయ్య కోసం మలయాళీ ముద్దుగుమ్మ..!

నటసింహా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు బ్లాక్‌ బాస్టర్‌ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతోంది. బిబి 3 వర్కింగ్ టైటిల్‌తో సినిమాను షూట్‌ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఫిబ్రవరి నెలలో మొదటి షెడ్యూల్ ను ముగించిన తరువాత చిత్రీకరణను నిలిపివేశారు. ఈ చిత్రంలో నటించే కథానాయికల కోసం బోయపాటి నిరంతర సెర్చ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్‌ ఒక కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. ప్రయాగ కేరళ బ్యూటీ. అక్కడ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించింది. తెలుగు లో డబ్ అయిన 'పిశాచి' చిత్రంలో ఆమె నటించింది. ప్రయాగ అందాలకు యూత్ ఫిదా అయిపోయారు అప్పట్లోనే. ఇక ఈ అమ్మడు మల్లూవుడ్ లో లానే టాలీవుడ్ లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోందట. ఇక షూటింగ్ దసరా తరువాత తిరిగి ప్రారంభమవుతుందని అంటున్నారు. దానిపై అధికారికంగా క్లారిటీ లేదు. 'సాహసం శ్వాసగా సాగిపో ' ఫేం మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో కనిపిస్తారని అంటున్నారు. అఘోరాగా, బిజినెస్ మేన్ గా బాలయ్య కనిపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Next Story