టీమిండియా మాజీ క్రికెట‌ర్ ప్రవీణ్‌ కుమార్‌.. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించాడు. తాను తాగి ప‌క్కింటి వారిపై దాడి చేశానంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని తెలిపాడు. వివ‌రాళ్లోకెళితే.. క్రికెట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ త‌ప్ప‌తాగి త‌మ‌పై దాడి చేశారంటూ దీప‌క్ శ‌ర్మ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశాడు.

దీనిపై స్పందించిన‌ ప్రవీణ్‌ కుమార్‌.. నాకు ఇద్దరు పిల్లలున్నారని.. నేను చీమ‌కు కూడా హాని త‌ల‌పెట్ట‌న‌ని.. అలాంటిది, తాగి ఒక అబ్బాయిపై, అతని తండ్రిపై దాడి చేశాన‌న‌డం బాధించింది అన్నాడు. ఆ అబ్బాయి తండ్రి దీపక్‌ శర్మనే తనపై చేయి చేసుకున్నాడని ఆరోపించాడు.

మా ఇంటికి సమీపంలోని ఒక‌ అబ్బాయి, అతని తండ్రి నాతో గొడవ పడ్డార‌నీ.. నేను కారులో ఉండ‌గా వారిద్దరూ.. నన్ను బయటలాగి.. నాపై దాడి చేశారని. నేను తాగి వారిని కొట్టాననడం అబద్ధమ‌ని అన్నారు. వారు నా గొలుసును లాక్కోవడానికి కూడా ప్రయత్నించారని ప్ర‌వీణ్ కుమార్‌ అన్నాడు.

అయితే.. ఇదంతా ఆ ఏరియాలో ఉన్న‌ రాజకీయాలతోనే నాపై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారని అన్నారు. నేను ఎప్పుడూ ఆ ఏరియాలో ఉండ‌న‌ని.. నాకు రెండు-మూడు ఇళ్లున్నాయని.. నేను ఇంటి పెయింట్‌ వర్క్‌ జరుగుతుంటే చూద్దామ‌ని వ‌చ్చాన‌ని.. సక్సెస్‌ చూసి ఓర్వలేకే.. నా ఇమేజ్‌ను డామేజ్ చేస్తున్నారని ప్రవీణ్‌ కుమార్ అన్నాడు. ఇదిలావుంటే.. ప్ర‌వీణ్ కుమార్ 6 టెస్టులు, 68 వ‌న్డేలు ఆడాడు. టెస్టుల్లో 27 వికెట్లు ప‌డ‌గొట్టిన ప్ర‌వీణ్.. వ‌న్డేల్లో 77 వికెట్లు తీశాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.