ఔను.. వాళ్లిద్ద‌రూ విడిపోయారు అన‌గానే ఇంత‌కీ ఎవరా ఇద్ద‌రు అనుకుంటున్నారా..? ఓ డైరెక్ట‌ర్, ఓ రైట‌ర్. మేం వ‌య‌సుకు వ‌చ్చాం, సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్, హ‌లో గురు ప్రేమ కోస‌మే.. ఈ సినిమాల‌న్నీ విజ‌యాలు సాధించాయి. వీటికి రైట‌ర్ ప్ర‌సన్న కుమార్.. డైరెక్ట‌ర్ న‌క్కిన త్రినాథ‌రావు. వీరిద్ద‌రు మ‌ట్టిలో మ‌ట్టిలా… నీళ్ల‌ల్లో నీళ్ల‌లా క‌లిసిపోయారు. అయితే.. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వైంద‌ట‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ విడిపోయార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే… ‘హ‌లో గ‌రు ప్రేమ కోస‌మే’ సినిమా త‌ర్వాత న‌క్కిన త్రినాథ‌రావు వెంక‌టేష్ తో సినిమా చేయాల‌నుకున్నారు. వెంకీ కూడా సినిమా చేయ‌డానికి ఓకే చెప్పార‌ట‌. అయితే… రైట‌ర్, డైరెక్ట‌ర్ ఇద్ద‌రికీ క‌లిపి రెమ్యూన‌రేష‌న్ 5 కోట్లు కావాల‌న్నార‌ట‌. ఇందులో సగం త‌న‌కు ఇవ్వాల‌న్నాడ‌ట రైట‌ర్ ప్ర‌స‌న్న కుమార్. డైరెక్ట‌ర్ న‌క్కిన త్రినాథ‌రావు కుద‌ర‌దు అన్నాడ‌ట‌. అక్క‌డే ఇద్ద‌రికీ తేడా వ‌చ్చింద‌ట‌.

ఇద్ద‌రూ విడిపోయార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం త్రినాథ‌రావు మ‌రో రైట‌ర్ తో క‌లిసి సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇక ప్ర‌సన్న కుమార్ ద‌ర్శ‌కుడిగా సినిమా చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.