చదువు ఘోష..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 4:38 PM GMT
చదువు ఘోష..!

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మండలంలోని చెరుకుంపాలెం ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న కోటపాడు కల్లూరు వారి పాలెం గ్రామానికి చెందిన సుమారు యాభై మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కురిసినట్టు వంటి భారీ వర్షానికి పాలేరు వాగు ఉప్పొంగడంతో అక్కడి ప్రజలు, ముఖ్యంగా విద్యార్ధులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కోటపాడు గ్రామంలో సుమారు రెండు వందల యాభై కుటుంబాలు నివసిస్తున్నారు.

అక్కడ ఉండే పిల్లలు మాత్రం స్కూలుకి రావాలంటే కత్తి మీద సాములాంటిది. ఏ చిన్నపాటి వర్షం పడినా రోడ్డులు బురదమయం అయి విద్యార్థులు రోడ్డు మీద వెళ్లాలంటే జారి పడుతూ ఉంటారు. వీరిలో కొంతమంది సైకిల్ పైన రాగా మరికొందరు నేటికీ నడకదారి పాఠశాలకు రావాల్సిన పరిస్థితి. వాళ్ల ఊరి నుండి పాఠశాలకు వెళ్లాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి.

వీరి గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయలేదు, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వీళ్ల బతుకులు మారటం లేదని ఆ గ్రామస్తులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పిల్లల ఉపాద్యాయులు కూడా అధికారులకి మొర పెట్టుకున్నా లాభం లేకపోయింది. ఇకనైనా తమ గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం కలిగించమని ప్రభుత్వాన్ని గ్రామస్తులు, విద్యార్థులు కోరుతున్నారు.

Next Story
Share it