ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త చెప్పిన 'రాధే శ్యామ్‌' మేకర్స్‌

By సుభాష్  Published on  17 Oct 2020 1:00 PM IST
ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త చెప్పిన రాధే శ్యామ్‌ మేకర్స్‌

అక్టోబర్‌ 23న ప్రభాస్‌ అభిమానులకు పండుగ రోజు. ఎందుకంటే.. ఆ రోజు ప్రభాస్‌ పుట్టిన రోజు. ఆ రోజు అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. కాగా.. ప్రభాస్‌ ప్రస్తుతం 'జిల్'‌ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్వకత్వంలో తెరకెక్కుతున్న 'రాధే శ్యామ్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం యూరప్‌లో జరుగుతోంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్స్‌పై సినిమా నిర్మితమవుతోంది.

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదవల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ప్రభాస్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యే విధంగా టీజర్ ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. 'బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌' పేరుతో 'రాధేశ్యామ్‌' మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. 'వాళ్లు దమ్ములని మరోసారి కచ్చితంగా ప్రేమలో పడేస్తారు. అక్టోబర్‌ 23న మోషన్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం' అంటూ మేకర్స్‌ ప్రకటించారు. దీంతో బీట్స్‌ ఆఫ్ రాధే శ్యామ్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. కాగా పీరియాడిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.



Next Story