ప్ర‌భాస్ 'జాను' గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2019 6:35 AM GMT
ప్ర‌భాస్ జాను గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ 'సాహో' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్ధాయిలో సక్సెస్ సాధించ‌క‌పోవ‌డంతో నెక్ట్స్ మూవీ విష‌యంలో ప్ర‌భాస్ చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. 'జిల్' మూవీ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకి 'జాను' అనేది వ‌ర్కింగ్ టైటిల్. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజ హేగ్డే న‌టిస్తుంది.

ఇది ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలిసింది. ఈ చిత్రంలో పూజ హెగ్డే టీచర్ పాత్రలో కనబడనుందని సమాచారం. ఇందులో ప్ర‌భాస్, పూజ హేగ్డేల పై రొమాంటిక్ సీన్స్ తెర‌కెక్కించ‌నున్నార‌ని... ఆ సీన్స్ ఆడియ‌న్స్ కి బాగా క‌నెక్ట్ అవుతాయ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. ఇట‌లీ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు విల‌న్ పాత్ర పోషించ‌నున్నార‌నే వార్త కూడా ఇటీవ‌ల బయ‌ట‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ విదేశాల్లో ఉన్నారు. వెళుతూ వెళుతూ.. ప్ర‌భాస్ ఈ సినిమా క‌థ పై మ‌రింత క‌స‌ర‌త్తు చేయాల‌ని డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కి చెప్పార‌ట‌. దీంతో రాధాకృష్ణ కుమార్ ప్ర‌స్తుతం అదే ప‌నిలో ఉన్నార‌ని తెలిసింది. 'సాహో'తో మిస్ అయిన స‌క్సెస్‌ ఈసారి మిస్ కాకుండా అభిమానులు మెచ్చేలా... 'జాను' టీమ్ వ‌ర్క్ చేస్తుంద‌ని స‌మాచారం.

Next Story
Share it