కరోనాను లెక్కచేయని ప్రభాస్ టీం
By రాణి Published on 17 March 2020 4:43 PM ISTఒక పక్క ప్రపంచమంతా కరోనా వైరస్ ప్రబలుతుంటే..దానిని లెక్కచేయకుండా 10 డిగ్రీల చలిలో, అందులోనూ వర్షం పడుతుండగా ప్రభాస్ 20వ సినిమా చిత్రం షూటింగ్ జరుపుకుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జార్జియాలో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా..పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read : మోదీ ప్రభుత్వం పౌరులకు సంబంధించిన డేటాను సేకరించే పనిలో నిమగ్నమై ఉందా..?
ఇప్పటి వరకూ ఈ సినిమా మూడు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తిచేసుకుని, ఫైటింగ్ సీన్ ను చిత్రీకరించడం కోసం కొద్దిరోజుల క్రితమే జార్జియాకు వెళ్లింది. కరోనా వైరస్ ఈ చిత్ర యూనిట్ సంకల్పం ముందు దిగదుడుపయ్యాయి. 10 డిగ్రీల చలిని కూడా లెక్కచేయకుండా అక్కడ జరగాల్సిన షూటింగ్ ను పూర్తి చేసుకుందీచిత్రం.
Also Read : సారీ..ఈసారికిలా కానిచ్చేద్దాం రామయ్య
ఈ మేరకు దర్శకుడు రాధాకృష్ణ చిత్రం షూటింగ్ సమయంలో తీసిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. మంగళవారంతో జార్జియా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నామని తెలిపారు. కిక్కాస్ షెడ్యూల్ ను పూర్తి చేసేందుకు సహకరించిన జార్జియా సాంకేతిక నిపుణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే త్వరలోనే ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.