గ్రీన్ ఇండియా ఛాలెంజ్ - 3.0ను ప్రారంభించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Jun 2020 2:13 PM GMT
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ - 3.0ను ప్రారంభించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

“పుడమి పచ్చగుండాలే – మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడవ దశ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడుకున్నదని అన్నారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా వారు దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్యక్రమం నన్ను ఇన్ స్పైర్ చేసింది.

అందుకే వారి స్పూర్తితో వారు ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నాను.” సంతోష్ కుమార్ మహోన్నతమైన ఆశయం ముందుకు పోవాలంటే.. మనమంతా వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజం బావుంటుందని నా భావన. ఈ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం కొనసాగింపుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు.

1 2 Untitled 1 Copy Untitled 2 Untitled 3 Untitled4 Untitled 6 Untitled 7 Untitled 14

Next Story
Share it