'పవర్‌ స్టార్‌' మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసిన రాంగోపాల్‌ వర్మ

By సుభాష్  Published on  9 July 2020 11:56 AM IST
పవర్‌ స్టార్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసిన రాంగోపాల్‌ వర్మ

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏదో విధంగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా క్లైమాక్స్‌, నేకెడ్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్జీవి.. రానున్న రోజుల్లో కరోనా వైరస్‌, మర్డర్‌ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా పవర్‌స్టార్‌ చిత్రాన్ని తెరకెక్కించున్నారు. దీంతో గురువారం 'పవర్‌ స్టార్‌' చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఇది పూర్తిగా కల్పిత చిత్రం మరియు ఏదైనా నిజమైన వ్యక్తులతో పోలి ఉన్న అది యాదృచ్ఛికంగా జరిగిన అనుకోని సంఘటన మాత్రమే అంటూ వర్మ ట్వీట్‌ చేశారు.

కాగా, లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ రాంగోపాల్‌ వర్మ హంగామా అంతా ఇంతా కాదు. ఏదో ఒక చిత్రాన్ని బయటకు వదులుతూ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్‌ సృష్టిస్తున్నారు. తాజాగా పవర్‌ స్టార్‌ సినిమా గురించి ప్రకటించి కొత్త వివాదాన్ని తెరలేపుతున్నారు. సినీ వర్గాల్లో ఆ సినిమా గురించి పెద్ద చర్చే జరుగుతోంది.

అయితే వర్మ, మెగా ఫ్యామిలీల మధ్య కొంత కాలంగా విబేధాలున్నాయన్న చర్చ సినీ ఇండస్ట్రీలో చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇటీవల 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే మూవీలో పవన్‌ కల్యాణ్‌ పాత్రను అభ్యంతకరమైన రీతిలో చూపించారనే ఆరోపణలు కూడా వర్మపై వచ్చాయి. పవన్‌ గురించే కాదు ఆ సినిమాలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తాజాగా పవర్‌ స్టార్‌ సినిమా ప్రకటించగానే పవన్‌ను టార్గెట్‌ చేయబోతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.



Next Story