పోర్న్ సైట్స్ కొత్త పోకడలు..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 1:58 PM GMT
పోర్న్ సైట్స్ కొత్త పోకడలు..!!

* రూటు మార్చుతున్న సైబర్ క్రైమ్స్

* నిఘా కన్ను కప్పి నెట్లో నీలి చిత్రాలు

*పోర్న్‌ చూడటంలో పురుషులతో మహిళలు పోటీ

* రెడ్ ట్యూబ్ . నెట్, పోర్న్ హబ్. ఆర్గ్ పేరుతో కొత్తగా మార్కెట్‌లోకి

* కట్టడికి కఠిన చట్టాలు కావాలంటోన్న సామాజిక కార్యకర్తలు

సాంకేతికత సంకెళ్లలో బందీ అయింది. బాహ్య ప్రపంచానికి దూరంగా అంతర్జాల ప్రపంచానికి దగ్గరగా బతకడానికి అలవాటు పడ్డారు. విఐటీ రాకతో వయసుతో నిమిత్తం లేకుండా బూతు చిత్రాలు చూస్తున్నారు. వీరి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది.

మొబైల్ ఫోన్, టాబ్లెట్, డెస్క్టాప్ లలో వీటిని చూస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్‌లలోనే 50శాతానికి పైగా పోర్న్ హబ్ ను వినియోగిస్తున్నారు. పోర్న్‌ వీడియోలు చూడటంలో మహిళలు పురుషులతో పోటీ పడుతున్నారు. దేశ జనాభాలో 49% మంది 18 - 24 , 30% మంది 25 - 34, 8% మంది 35 - 44, 5% మంది 45 - 54, 4% మంది 55 -64, 4% మంది 65 నుండి ఆ పైబడిన వయస్సు వారు ఈ నీలి చిత్రాలు చాటుగా చూస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రపంచంలో పోర్న్ వెబ్ సైట్స్ చూసే దేశాలలో యూ ఎస్, యూ కె తరువాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు మనోళ్లు ఎంత పాస్ట్‌ గా ఉన్నారో. గతంలో మొత్తం 857 నీలి చిత్రాలు వెబ్ సైట్లును తొలగించారు.

అయితే ..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోర్న్ సైట్స్ నిర్వాహకులు తిరిగి భారత దేశంపై కన్నేశారు. గ్లోబల్ ప్రాచుర్యం పొందిన ప్రధాన రెండు పోర్న్ పోర్టల్స్ రెడ్ ట్యూబ్, పోర్న్ హబ్ లు వాటి డొమైన్ ల పేర్లను రెడ్ ట్యూబ్.నెట్, పోర్న్ హబ్. ఓఅర్జి గా మార్చుకుని తిరిగి నెట్ లో దర్శనమిస్తున్నాయి.

ప్రభుత్వం కేవలం .com వెబ్సైట్లను నిషేధించింది. .org , .net లను బ్యాన్ చేయలేదు. అందుకు కారణం లేకపోలేదు. లాభాలు ఆశించని సంస్థలు .org డొమైన్ ని వినియోగిస్తాయి. net డొమైన్ పేరు పొడిగింపు "నెట్‌వర్క్" ను సూచిస్తుంది - ఇంటర్నెట్, ఈ మెయిల్ , నెట్‌వర్కింగ్ సర్వీసు ప్రొవైడర్లకు అనుకూలంగా సిఫార్సు చేయబడింది.

భారతదేశంలో కఠినమైన సైబర్ భద్రతా చట్టాల అవసరం చాలా ఉందని ప్రముఖ సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ అభిప్రాయం వ్యక్తపరిచారు. రాజధానిలో ఇటీవల ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్‌లో సైబర్ నేరాలకు సంబంధించిన సమస్యలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

A

నిషేధమున్నా సైబర్ నిఘా కన్ను గప్పి చాపకింది నీరులా సరికొత్త డొమైన్ లతో అశ్లీల చిత్రాలలు అంతర్జాలంలో అడుగుపెడుతున్నాయి. ప్రభుతం సైబర్ నేరాలపై గట్టి నిఘా పెట్టి, చట్టాలను మరింత కఠినతరం చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

Next Story