ముఖ్యాంశాలు

  • స్టీవ్‌ పార్నెల్‌ పేరిట పలు నీలి చిత్రాల్లో న‌ట‌న‌
  • విష‌యం తెలియ‌గానే అవాక్క‌యిన ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు

న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. నవంబర్ 5న నెల్సన్‌ వేదికగా జరిగిన మూడో టీ20 కోసం ప్రకటించిన అంపైర్ల జట్టులో ఒకడైన గార్త్‌ స్టిరాట్ గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెల్ల‌డైంది. ఆట‌గాళ్లంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిని ఆ విష‌యం ఏమిటంటే.. గార్త్‌ స్టిరాట్ మాజీ పోర్న్ స్టార్ అని. ఇది విన్న క్రీడాలోకం విస్తుపోయింది.

ఈ మ్యాచ్‌లో 51 ఏళ్ల గార్త్‌ స్టిరాట్‌ ఫోర్త్ అంఫైర్‌గా వ్వవహారించారు. బ్రిటిష్ టాబ్లాయిడ్ ‘ద సన్’ ప్రచురించిన వార్త కథనం ప్రకారం అతడి చిత్రాలు ఓ మ్యాగజైన్‌లో కూడా ప్రచురితమయ్యాయి. స్టీవ్‌ పార్నెల్‌ పేరిట పలు నీలి చిత్రాల్లో నటించాడు. అతనొక పోర్న్‌స్టార్‌ అన్న విషయం న్యూజిలాండ్‌ క్రికెటర్లకు తెలుసు. ఇదే విషయాన్ని ఇంగ్లాండ్‌ ప్లేయర్లకు కివీస్ క్రికెటర్లు చెప్పడం విశేషం.

అయితే.. పదేళ్ల క్రితం న్యూజిలాండ్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా కూడా గార్త్ స్టిరాట్‌ పని చేశాడు. ఆ సమయంలోనే అతడు పోర్న్‌ స్టార్‌గా నీలి చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత ఈ విషయం బ‌య‌టికి పొక్క‌డంతో పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత క్రికెట్‌ అంపైర్‌గా అవతారం ఎత్తాడు. పలు మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లకు స్టిరాట్‌ అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.