ఏపీ పాలిసెట్‌ విద్యార్థులకు ఊరట

By సుభాష్  Published on  8 Oct 2020 12:50 PM GMT
ఏపీ పాలిసెట్‌ విద్యార్థులకు ఊరట

ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. 'పాలిసెట్‌'లో అర్హత మార్కులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బీసీ, ఓబీసీ విద్యార్థులకు 30 శాతం అర్హత మార్కులుండగా, దానిని 25 శాతానికి తగ్గిస్తున్నట్లు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డిపార్టుమెంట్‌ స్పెషల్‌ సీఎస్‌ అనంతరాములు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంసెట్‌, ఈసెట్‌లలో 25శాతమే కనీస ఉత్తీర్ణత మార్కులు ఉండటం వల్ల ఈ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎలాంటి అర్హత మార్కులు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న 6 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి ఒకేషనల్‌ డిప్లొమా కోర్సులను ప్రారంభించేందుకు అనుమతులు మంజూరు చేసింది.

Next Story