నెటిజన్లకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చిన గోరంట్ల, విజయసాయి..
By రాణి Published on 28 April 2020 2:13 PM GMTలాక్ డౌన్ తో రాజకీయ నాయకులెవరూ బయటికొచ్చే పరిస్థితి లేదు. పాదయాత్రలు, పరామర్శలు, అవినీతి ఆరోపణలు, ఆఖరికి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మీడియా ఎదుట విమర్శలు చేసుకునేంత తీరిక ఉన్నా..అవకాశం లేదు. అందుకే ఇక ట్విట్టర్ వేదికగా పేర్లు చెప్పకుండా సెటైర్లేసుకుంటున్నారు రాజకీయ నేతలు. విజయసాయి వర్సెస్ నాగబాబు చాప్టర్ ముగిశాక విజయసాయి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
ఇప్పుడు గోరంట్ల కూడా అదే పనిలో ఉన్నారు.
" నేను మొనార్క్ ని నన్ను ఎవరు మోసం చెయ్యలేరు-A1
నేను ప్రపంచం లొనే గొప్ప వాడిని-A2
"అ ఆ లు రావు కానీ అగ్ర తాంబూలం కావాలన్నడాంట" నేను ఏమన్నా చేస్తాను. నాకు బలం ఉంది కాబట్టి అని ప్రగల్బాలు పలకడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.
దీనిని ఆంగ్లం లో "Grandiose delusions" అనే జబ్బు గా పిలుస్తాం." అంటూ సెటైర్లు వేశారు.
ఇది కాస్త పక్కన పెడితే మంగళవారం మధ్యాహ్నం విజయసాయిరెడ్డి
" క__రో__న చంద్రబాబు ఏడుపును చూసి .. పై ఖాళీలను పూరించండి.." అంటూ నెటిజన్లు టిడిపి ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను చూసి స్పందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
మొన్న 'బ__యి' వల్ల నలిగాడు.
నిన్న 'ని__'కాయ వల్ల నలిగాడు.
రేపు ఏ కాయ వల్ల నలుగుతాడో..
పై ఖాళీలను జగన్ పై ప్రేమతో పూరించండి.. అంటూ రివర్స్ ట్వీట్ వేశారు. ఇదంతా చూస్తున్న కొందరు నెటిజన్లు ట్విట్టర్ లో ఈ బూతు పురాణాలేంటి ? దయచేసి మమ్మల్ని బ్లాక్ చేయండి బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నారు.