ఆ వ్యక్తి నడుపుతున్న కారును చూసి విస్తుపోయిన పోలీసులు
By రాణి Published on 2 Jan 2020 6:55 PM ISTలండన్ : న్యూ ఇయర్ అంటే.. ఈ రోజుల్లో దాదాపు ఆడ, మగ తేడా లేకుండా తాగేసి..రోడ్లపైకి ఎక్కి గోలగోల చేస్తున్నారు. కొత్తసంవత్సరం వస్తుందన్న ఆనందంలో తాగి వాహనాలు డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన వారెందరో ఉన్నారు కానీ..ఈ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాడు. అతను చేసిన పనిచూసిన పోలీసులకు మూర్ఛవచ్చినంత పనైంది. తాగితే ఒళ్లు తెలీకుండా ప్రవర్తిస్తారు అంటారు గానీ...మరీ ఘోరంగా నడిపే కారుకి టైర్లున్నాయో లేదో కూడా తెలీనంత మత్తులో ఊగిపోయాడు. తాగిన మత్తులో తన కారుకు టైర్లు ఉన్నాయో, లేదో కూడా చూసుకోకుండా స్టీరింగ్ పట్టేశాడు. పెద్ద శబ్దంతో దూసుకొస్తున్న కారును చూసి హడలిపోయిన పోలీసులు అతడికి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తే రక్తంలో ఆల్కహాల్ శాతం ప్రతీ వంద గ్రాములకు 196 మిల్లీ గ్రాములు దాటేసింది. ఇది చూసిన పోలీసులు విస్తుపోయారు. అంతేకాక అతనే కారు చక్రాలకు టైర్లు లేవు. ఇంగ్లండ్‌లోని గ్రేట్ మాంచెస్టర్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగుచూసింది.
న్యూ ఇయర్ వేడుకల నుంచి వస్తున్న అతన్ని చూసి పోలీసులు పెద్దగా ఆశ్చర్యపోలేదు కానీ, కారుకు ముందు టైర్లు లేకుండానే ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించడం మాత్రం వారిని విస్తుపోయేలా చేసిందట. కారుకు సంబంధించిన ఫొటోలను గ్రేటర్ మాంచెస్టర్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేయడంతో ఈ విషయం బయటికొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రీత్ టెస్ట్ తర్వాత అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.