26వేల కిలోల గోమాంసం పట్టివేత
By సుభాష్ Published on 22 Jun 2020 1:01 PM ISTకోల్‌కతా నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న గోమాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్‌లో ఈ గోమాంసాన్ని తరలిస్తుండగా, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఒడిశాలోని బరంపురంలోని భజరంగ్‌దళ్ సభ్యులకు గోమాంసాన్ని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో వారు కంటైనర్‌ను ఫాలో చేస్తూ ఇచ్ఛాపురం సీఐ వినోద్‌బాబుకు సమాచారం అందించారు.
దీంతో వారు పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద కంటైనర్‌ను తనిఖీ చేశారు. ఒక్కొక్కటి 20కిలోల చొప్పున 1300 ప్యాకెట్లతో ఈ గోమాంసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.10.40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో మాంసంలో పాటు లారీ, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story