ఎరక్కపోయి వచ్చాడు..ఇరుక్కుపోయాడు..
By రాణి Published on 27 April 2020 1:23 PM ISTవైరస్ సోకుతుంది..బయటికి రాకండి మొర్రో అని ప్రభుత్వం, అధికారులు, పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా ఇంకా కొంతమంది వినడం లేదు. పని ఉన్నా, లేకపోయినా ఊరికే అలా రోడ్డుపైకి వెళ్తే ఏమవుతుంది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సొంతవాహనాలపై వెళ్తే సీజ్ చేస్తున్నారని అతి తెలివిగా నడుస్తూ కూడా రోడ్డుపై తిరిగేవారు కూడా ఉన్నారు. ఇటీవలే చెన్నైలో ఒక బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులకు పోలీసులు గుణపాఠం నేర్పారు. పనిపాట లేకుండా రోడ్డుపై చక్కర్లు కొడుతున్న వారిని కరోనా పేషెంట్ ఉన్న అంబులెన్స్ ఎక్కించి పిచ్చెక్కించారు వాళ్లకు. ఆఖరికి అతనికి కరోనా లేదని, వారికి బుద్ధి చెప్పేందుకే ఇలా ట్రై చేశామని పోలీసులు చెప్పారు. ఇప్పుడు నరసరావుపేట పల్నాడు రోడ్ లో కూడా దాదాపు ఇలాంటి సంఘటనే జరిగింది.
Also Read : కరోనా నెగిటివ్ అని ఇంటికి పంపేశారు..మళ్లీ పాజిటివ్ వచ్చిందంటూ..
సదరు వ్యక్తి ఏ పని మీద బయటికి వచ్చాడో తెలీదు కానీ.. పోలీసుల కంటపడ్డాడు. ఇక అంతే..పోలీసులు అతను చెప్పేదేమీ వినకూడదని డిసైడ్ అయ్యారు. అతడిని ఎందుకు బయటికొచ్చావ్ అని తిట్టనూ లేదు..కొట్టనూ లేదు. సింపుల్ గా అంబులెన్స్ ఎక్కించి క్వారంటైన్ కేంద్రానికి పంపేశారంతే. ఒక్కసారి క్వారంటైన్ కేంద్రంలోకి ఎంటరైతే 14 రోజుల పాటు అక్కడే ఉండాలి. వాళ్లు చెప్పింది విని, పెట్టింది తినాలి.. పెట్టింది తినడమంటే ఏదొక చెత్త కాదు..పౌష్టికాహారమే పెడుతారు..కాకపోతే బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. చూడండి..ఏ పని లేకుండా అనవసరంగా బయటికొచ్చి ఎలా ఇరుక్కుపోయాడే. ఎరక్కపోయి వచ్చాడు..ఇరుక్కుపోయాడంటే ఇలానే ఉంటుందేమో. ఇప్పుడు అతడి కుటుంబ అవసరాలను తీర్చేందుకు ఎవరొస్తారు ? బయటికొచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి. నిత్యావసరాలు, అత్యవసరమైతే తప్ప గుమ్మం దాటొద్దు..గుమిగూడొద్దు.
Also Read : కన్నతల్లితో గొడవ.. ఆ తర్వాత డంబెల్ తో..