బాబూ సుదీర్ఘకాలం సీఎంగా ఉండి అవేం మాటలు: పోలీసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2019 3:01 PM GMT
బాబూ సుదీర్ఘకాలం సీఎంగా ఉండి అవేం మాటలు: పోలీసులు

అమరావతి: పోలీసులు పోస్టింగ్‌లకు కక్కుర్తిపడి అధికార పార్టీ నేతలు ఏది చెబితే అది చేస్తారని చంద్రబాబు కామెంట్ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు ఆ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న పోలీసుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. సుదీర్ఘకాలం సీఎంగా పని చేసిన చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. పోలీస్‌ శాఖలో పోస్టింగ్‌లు నిజాయితీ, పనితీరు, నైపుణ్యాలను బట్టి లభిస్తాయన్నారు. అంతేకాని..వాటి కోసం నాయకులకు, వర్గాలకు కొమ్ము కాయాల్సిన అవసరంలేదని లేఖలో పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తారే కాని..వ్యక్తిగత, స్వార్ధప్రయోజనాలకు వారు అండదండలు అందించరని పోలీసులు లేఖలో చెప్పారు.

Next Story
Share it