ప్రజల కోసమే పోలీసులు - ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 9:41 AM GMT
ప్రజల కోసమే పోలీసులు - ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

అమరావతి: పోలీసుల అమరవీరుల సంస్మరణ దినాన్ని అక్టోబర్ 21 న జరపుకుంటున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ తెలిపారు. అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివన్నారు. ఈ వారం మొత్తం పోలీసుల సేవలు ప్రజలకు తెలిసేలా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 2,511 పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన 1,81,315 మంది విద్యార్దులు ఓపెన్ హౌస్ లో పాల్గొన్నారని చెప్పారు. వారికి రహదారి భద్రత, సిటిజన్ సెంటర్ సర్వీస్, డ్రోన్స్, టెక్నాలజీ పోలీసింగ్, డయల్ 100 , క్లూస్ టీమ్స్, ఆయుదాలు వాడకం గురించి తెలియజేశామన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణదినం కోసం 10,513 మంది పోలీసులు, ప్రజలు రక్తదానం చేశారన్నారు డీజీపీ సవాంగ్.

వీక్లీ ఆఫ్‌లతో పోలీసుల కుటుంబాల్లో ఆనందం

పోలీసుశాఖలో వీక్లీ ఆఫ్‌లతో వారి కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని చెప్పారు సవాంగ్. సుమారు 62,000 కుటుంబాల్లోఆనందాలువెల్లివిరిశాయన్నారు. పోలీసుల వీక్లీ ఆఫ్ యాప్ ను త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. పోలీసు కుటుంబాల ఆరోగ్యం కోసం ఆరోగ్యభద్రత స్కీమ్ బాగా ఉపయోగపడుతుందన్నారు సవాంగ్.

విధి నిర్వహణలో పోలీసులు మరణిస్తే రూ.40లక్షల ఇన్సూరెన్స్‌

పోలీసులు విధి నిర్వహణలో మరణిస్తే దాదాపు రూ.40 లక్షల ఇన్స్యూరెన్స్ అందిస్తున్నామని చెప్పారు డీజీపీ సవాంగ్ .దేశంలోనే మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో ఏపీలోనే అందిస్తున్నారని ప్రకటించారు డీజీపీ సవాంగ్.

హోంగార్డులకు రోజు వేతనం 600 నుంచి 710 వరుకు పెంచామని..దీనిద్వారా

15,000 హోంగార్డులకు ప్రయోజనం చేకూర్చేలా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

'స్పందన'కు ప్రజల నుంచి మంచి స్పందన

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'స్పందన కార్యక్రమం' ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు డీజీపీ సవాంగ్. దీనిద్వారా అనేక కేసులు పరిష్కారం అవుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 31, 773 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 7,442 కేసులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశామన్నారు. 23, 677 కేసులు పరిష్కారించగలిగామన్నారు డీజీపీ . ఇంకా.. 654 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు డీజీపీ సవాంగ్.

Next Story
Share it