భార్య, అత్తమామలను చితకబాదిన భర్త... పోలీసులకు ఫిర్యాదు

 Published on  7 Dec 2019 2:53 PM GMT
భార్య, అత్తమామలను చితకబాదిన భర్త... పోలీసులకు ఫిర్యాదు

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులో భర్త, భార్యపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పటాన్‌ చెరుకు చెందిన రఘుమారెడ్డి అనే వ్యక్తి హయత్‌నగర్‌కు చెందిన అనూషను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం అయినప్పటి నుంచి అనుషకు అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో భర్త భార్యను పుట్టింటికి పంపించేశాడు. ఈ విషయమై అడిగేందుకు అనుష తల్లిదండ్రులు రఘుమారెడ్డి ఇంటికి వెళ్లారు. తీవ్ర అగ్రహానికి గురైన అనుష అత్తమామలు వారిని తీవ్రంగా తీవ్రంగా చితకబాదారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన భార్యను సైతం కర్రలు, బెల్టుతో భర్త, అతని సోదరుడు దారుణంగా చితకబాదారు. గమనించిన స్థానికులు రఘుమారెడ్డి ఇంటికి చేరుకుని వారిని విడిపించారు. దీంతో బాధితురాలు అనుష పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ బిడ్డను, తమను ఇంతలా హింసించిన రఘుమారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Next Story
Share it