మహిళలను వెంటాడి కొట్టిన పోలీసులు ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 2:23 PM GMT
మహిళలను వెంటాడి కొట్టిన పోలీసులు ..!

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన మిలియన్‌ మార్చ్‌ లో పోలీసులు చెలరేగిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా విరుచుకుపడ్డారు. పోలీసులు ఎంత నిర్భందాన్ని విధించినా… కార్మికులు ట్యాంక్‌బండ్‌కు పోటెత్తారు.

అయితే... ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్న మహిళలను పోలీసులు టార్గెట్ చేశారు. మహిళా పోలీసులు లేకున్నా, మహిళలను నెట్టేస్తూ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళా కార్మికురాలిపై సీఐ కిషోర్ అనే అధికారి తీవ్రంగా దాడిచేశారు. దాంతో ఆ కార్మికురాలి కంటి నుండి తీవ్ర రక్తస్రావం అయింది. ఎంతకు రక్తం ఆగకపోవటంతో… కార్మికులు గుమికూడినా, ఆ అధికారి కనీసం మానవత్వంగా కూడా స్పందించకపోగా, మీరంతా ఇక్కడి నుండి వెళ్లండి లేదంటే అందరికీ ఇదే పరిస్థితి అంటూ హెచ్చరించారు. సాటి మహిళా కార్మికులు ప్రతిఘటిస్తున్నా సీఐ కిషోర్ దౌర్జన్యంగా మాట్లాడటంపై తీవ్రంగా మండిపడుతున్నారు.

ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని పోలీసులు దాడులు చేసినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకు ఇంత కేసీఆర్ అనుభవించక తప్పదంటూ ఆవేదన వ్యక్తం చేశారు పలువురు మహిళా కార్మికులు.

Next Story