హైదరాబాద్‌ : ఐపీఎస్‌లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పోలీస్ అకాడమి డైరక్టర్ వీకే సింగ్. శిక్షణ తీసుకున్న ఐపీఎస్‌లు సైతం ప్రజల్లో పోలీసులపై ఉన్న అభిప్రాయాన్ని మార్చలేకపోతున్నారని చెప్పారు. దేశంలో ఉన్న పోలీస్‌ అకాడమీలు అన్ని డంపింగ్ యార్డ్‌లుగా మారాయన్నారు. అకాడమీలో తీసుకుంటున్న శిక్షణ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగంలేదన్నారు. జైలుకు వచ్చే ఖైదీలు ..తోటి ఖైదీలను చూసి ..నేరాల్లో కొత్త టెక్నిక్‌లు నేర్చుకుంటున్నారన్నారు. ఫీల్డ్‌లో వాస్తవాలకు అనుగుణంగా పోలీసులు ఉండలేకపోతున్నారని చెప్పారు. డబ్బు, అధికారం ఉన్న వాళ్లతోనే పోలీసులు స్నేహంగా ఉంటున్నారని వీకే సింగ్ అభిప్రాయపడ్డారు.

బ్రిటీష్ కాలం నాటి ఆనవాయితే ఇంకా కొనసాగుతుందన్నారు. పోలీసులు ప్రభుత్వానికి జవాబుదారీ కాదు..చట్టానికి మాత్రమేనన్నారు. అకాడమీలో శిక్షణకు, గ్రౌండ్ లెవల్‌కు లింక్ ఉండాలన్నారు. పోలీసుల శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు వెచ్చిస్తున్నాయని..వాటి వలన లాభంలేదని వీకే సింగ్ చెప్పారు. పోలీస్‌ శిక్షణాకేంద్రాలు కాలేజీలు, స్కూళ్లు కావు. ప్రజలతో ఎలా ఉండాలో శిక్షణాకేంద్రాల్లో నేర్పాలన్నారు.

దేశంలో క్రిమినల్ జస్టిస్ ప్రొసిజర్ ప్రజలకు వ్యతిరేకంగా ఉందని పోలీస్‌ అకాడమీ డైరక్టర్ వీకే సింగ్ అభిప్రాయపడ్డారు. పోలీసులకు, ప్రజలకు మధ్య పెద్ద గ్యాప్ ఉందన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణాలుకోల్పోతున్న..ప్రజలు మాత్రం ప్రశంసించడంలేదన్నారు. ఎస్పీ నుంచి ఎస్‌హెచ్‌ఓ వరకు గ్రౌండ్ లెవల్ పనితీరు మీదనే ప్రమోషన్లు ఉండాలన్నారు. దీనిపై డీజీపీ కూడా హామీ ఇచ్చారని చెప్పారు పోలీస్ అకాడమీ డైరక్టర్ వి.కె. సింగ్.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.