పోలవరం ప్రధాన రీ టెండర్ లో ప్రభుత్వానికి రూ. 628 కోట్ల ఆదా ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 10:57 AM GMT
పోలవరం ప్రధాన రీ టెండర్ లో ప్రభుత్వానికి రూ. 628 కోట్ల ఆదా ..!

  • రివర్స్ టెండరింగ్ తో ఫలితాలు సాధిస్తున్న ఏపీ ప్రభుత్వం
  • పోలవరం 65వ ప్యాకేజీలో ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా ఆదా
  • పోలవరం ప్రధాన రీ టెండరింగ్ లో రూ.628 కోట్లు ఆదా
  • పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన పనులు దక్కించుకున్న 'మేఘా'

అమరావతి: ఏపీలో వైఎస్ జగన్‌ ప్రభుత్వం అనుకున్నట్లుగానే అడుగులు వేస్తుంది. గత వారంలో పోలవరం 65వ ప్యాకేజీలో రివర్స్ టెండరింగ్ కింద రూ.50కోట్లకు పైగా ఏపీ ప్రభుత్వం ఆదా చేసుకుంది. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన రీ టెండరింగ్‌లో ఏకంగా రూ. 628 కోట్లు ఏపీ ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన పనులు 'మేఘా'కి దక్కాయి.

గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువ శాతంకు -12.6% కు 'మేఘా' బిడ్ వేసింది. అంటే..రూ. 4, 358 కు పనులు చేపట్టేందుకు 'మేఘా' ముందుకొచ్చింది.

ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ..ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4, 987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలిచింది. ఈ పనికి 'మేఘా ' ఒక్కటే రూ.4,358 కోట్లకు టెండర్‌ వేసింది.

కోర్టు అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్న 'మేఘా'

రివర్స్ టెండరింగ్‌లో భాగంగా ఏపీ ప్రభుత్వం పోలవరం కాంట్రాక్టును రద్దు చేసి.. తిరిగి టెండర్‌ను పిలిచింది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా రివర్స్‌ టెండరింగ్ నిర్వహిస్తున్నారు. ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనాగా తీసుకుంటారు. ఈ అంచనాను పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరం హెడ్ వర్క్స్‌తోపాటు, జల విద్యుత్ కేంద్రాలను కలిపి రివర్స్ టెండరింగ్‌కు పిలిచింది. ప్రభుత్వం ఆదేశిస్తే పనులు ప్రారంభించేందుకు రెడీగా ఉన్నట్లు 'మేఘా'ప్రతినిధులు చెప్పారు.

Next Story
Share it