ప్రధాని మోదీ కోసం ప్రత్యేక గుడి..!

By Newsmeter.Network  Published on  26 Dec 2019 4:08 AM GMT
ప్రధాని మోదీ కోసం ప్రత్యేక గుడి..!

చెన్నై: ఆ అభిమానికి దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేవుడయ్యారు. మోదీ కోసం ఆ అభిమాని ప్రత్యేకంగా గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. పీశంకర్‌ అనే రైతు తిరుచిరాపల్లిలోని తన స్వగ్రామమైన ఎరాకుడిలోని తన భూమిలో మోదీకి గుడి కట్టాడు. రూ.1.2 లక్షలతో ఎనిమిది అడుగుల ఎత్తులో గుడి నిర్మించాడు. గుడిలో ప్రధాని మోదీ విగ్రహన్ని ప్రతిష్టించాడు. ఆవిగ్రహానికి రోజు పూజలు చేస్తూ హారతి ఇస్తున్నాడు. గుడి లోపల తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, హోంమంత్రి అమిత్‌షా, తమిళనాడు సీఎం పళనిస్వామి, మహాత్మాగాంధీ, ఎంజీ రామచంద్రన్‌, కాంగ్రెస్‌ నేత కే కామరాజ్‌ ఫొటోలు కూడా ఉన్నాయి. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలను తనను ఆకర్షించాయని రైతు శంకర్‌ చెబుతున్నాడు.

ప్రధాని మోదీ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని .. అందుకే మోదీకి గుడి కట్టానని రైతు శంకర్‌ తెలిపాడు. తమిళనాడులో మనుషులకు గుడులు కట్టడం కొత్తేమి కాదు. గతంలో చాలా మంది సినిమా యాక్టర్లతో పాటు, పలువురు ప్రముఖులకు కూడా గుడి కట్టారు. తమిళనాడులో చాలా మందికి దైవ భక్తి ఎక్కువ. మనుషులు ఎవరైనా మంచి పనులు చేస్తే వారిని దేవుడితో కొలుస్తూ గుడి కట్టి పూజిస్తారు. ఇప్పుడు మనిషి దేవుళ్ల జాబితాలో మన ప్రధాని నరేంద్రమోదీ కూడా చేరిపోయారు. రైతుల కోసం మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం నచ్చిందని రైత శంకర్‌ చెప్పారు. తన పొలంలో మోదీకి గూడి కట్టి పూజలు చేస్తున్నాడు. కేవలం మోదీ పథకాలకు తనను ఆకర్షించాయని.. తాను బీజేపీ కార్యకర్తను కూడా కాదన్నారు. మోదీకి గుడికట్టిన శంకర్‌ను అక్కడి స్థానిక బీజేపీ నేతలు మెచ్చుకుంటున్నారు. పార్టీలో చేరాలని శంకర్‌ను ఆహ్వానించారు.

Next Story