రిషి కపూర్ పై ప్రధాని ప్రశంసలు..కుప్పకూలిన అమితాబ్

By రాణి  Published on  30 April 2020 12:41 PM IST
రిషి కపూర్ పై ప్రధాని ప్రశంసలు..కుప్పకూలిన అమితాబ్

బాలీవుడ్ సోగ్గాడు, బాబీ రిషి కపూర్ గురువారం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. రిషి కపూర్ రన్ బీర్ కపూర్ తండ్రి. అమితాబ్ కు తోటి నటుడు. ఆయన నటనా కౌశల్యంతో అప్పటి యువతను ఉర్రూతలూగించారు. టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు అయితే..బాలీవుడ్ సోగ్గాడిగా రిషి కపూర్ ను పిలిచేవారు. నిన్న ఇర్ఫాన్ ఖాన్..ఈ రోజు రిషి కపూర్ మరణ వార్తలతో అమితాబ్ బచ్చన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయానని సోషల్ మీడియాలో తన భావోద్వేగాన్ని తెలిపారు. ఇంత గొప్ప నటుడిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందంటూ సంతాపం తెలిపారు.

Also Read : ఆరోగ్య సేతు తప్పనిసరి..అది ఉంటేనే ఆఫీసులకు రండి : కేంద్రం

ప్రధాని నరేంద్రమోదీ సైతం రిషి కపూర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వ్యక్తి, నా మిత్రుడిని కోల్పోవటం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. అని పేర్కొంటూ ప్రధాని ట్వీట్ చేశారు. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు సైతం రిషికపూర్ మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.



Next Story