‘అతి’ సంబరాలపై ఐసీసీ సీరియస్.. ఐదుగురు ఆటగాళ్ల పై చర్యలు

By Newsmeter.Network  Published on  11 Feb 2020 10:44 AM IST
‘అతి’ సంబరాలపై ఐసీసీ సీరియస్.. ఐదుగురు ఆటగాళ్ల పై చర్యలు

అండర్‌-19 ప్రపంచ కప్‌ ఫైనల్ అనంతరం చోటు చేసుకున్న ఘటనపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పోచెఫ్‌స్టూమ్ర్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ లో.. మ్యాచ్‌ గెలవగానే బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. మైదానంలోకి దూసుకొచ్చి.. నిరాశలో ఉన్న భారత క్రికెటర్లని కవ్విస్తూ సంబరాలు చేసుకున్నారు. కొందరు ఆటగాళ్లు హద్దు దాటి ప్రవర్తించారు. దీంతో భారత ఆటగాళ్లు కూడా ధీటుగా బదులిచ్చేందుకు ప్రయత్నించడంతో ఫీల్డ్ అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పారు. అయినప్పటికీ.. బంగ్లాదేశ్ ఆటగాళ్లు వెనక్కి తగ్గకుండా అలానే కవ్వింపులని కొనసాగించారు.

ఈ ఘటన పై ఐసీసీ సీరియస్‌ అయ్యింది. జెంటిల్మెన్‌ గేమ్‌లో క్రీడాస్పూర్తిగా వ్యవహరించాలంటూ.. నిబంధనలను ఉల్లంగించిన ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వీడియో పుటేజీలను పరిశీలించిన అనంతరం ఐదుగురు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్ జట్టులో తౌహిద్‌ హ్రిదోయ్‌, షమీమ్‌ హుస్సేన్‌, రకీబుల్ హసన్‌.. భారత జట్టులో ఆకాశ్ సింగ్‌, రవి బిష్టోయ్ లు ఐసీసీ నియమావళి ఉల్లగించినట్లు గుర్తించింది.

నియమావళిని ఉల్లగించినట్లు ఆటగాళ్లు అంగీకరించారని ఐసీసీ తెలిపింది. తాహిత్‌, షమీమ్‌, ఆకాశ్‌ సింగ్‌ కు ఆరు అయోగ్యత( పాయింట్లు, రకీబుల్, బిష్ణోయ్‌ కు రెండు అయోగ్యత పాయింట్లు ఇచ్చింది.

Next Story