రంగారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 9:30 AM GMT
రంగారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. ఇబ్రహీంపట్నంలోని ఓ షాప్‌లో ఆరోగ్య కంపెనీకి చెందిన 25 కిలోల సన్న బియ్యాన్ని 1100 రూపాయలకు బోడకొండ గ్రామానికి చెందిన రవి నిన్న కొనుగోలు చేశారు. రాత్రి రవి భార్య ధర్మ బియ్యం వండి కుటుంబ సభ్యులు తిన్న తరువాత విరోచనాలు అయ్యాయని బాధితులు తెలిపారు. కాగా వండిన బియ్యాన్ని ముద్దాలు చేసి నేలమీద కొడితే బంతిలాగా ఎగురుతున్నాయి. దీంతో ప్లాస్టిక్ బియ్యాన్ని తమకు అమ్మారని బాధితులు వాపోతున్నారు. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story
Share it