బ్రేకింగ్‌ : మరో ఘోర విమాన ప్రమాదం..!

By సుభాష్  Published on  27 Jan 2020 12:31 PM GMT
బ్రేకింగ్‌ : మరో ఘోర విమాన ప్రమాదం..!

మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆప్గనిస్తాన్‌లోని తాలిబన్ల ఆధీనంలో ఉన్న సెంట్రల్‌ ఘాంజీ ప్రావిన్స్‌ లో ‘ఏరియానా ఆప్గాన్‌ ఎయిర్‌ లైన్స్‌‘ కు చెందిన విమానం సోమవారం మధ్యాహ్నం కుప్పకూలినట్లు ప్రావిన్స్‌ అధికార ప్రతినిధి స్థానిక మీడియాకు తెలియజేసినట్లు సమాచారం. సాంకేతిక కారణాల వల్ల ఈ విమానంలో మంటలు చెలరేగి కుప్పకూలినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో ఎంత మంది ప్రయాణికులున్నారు.. ఎలాంటి నష్టం జరిగిందని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా, హిందూకుష్‌ పర్వతాల పాదల చెంతనున్న ఘాంజీ ప్రావిన్స్‌ లో శీతాకాలంలో తీవ్రమైన చలి ఉంటుంది. ఈ కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. 2005 సంవత్సరంలో ఇదే ప్రాంతంలో మంచు కారణంగా విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అనేక సార్లు సైన్యం విమానాలు కూడా కూలిపోయాయి.

Next Story