భగ్గుమన్న పెట్రోల్‌, డిజీల్‌ ధరలు.. రేపటి నుంచి అమలు

By సుభాష్  Published on  29 Feb 2020 3:26 PM GMT
భగ్గుమన్న పెట్రోల్‌, డిజీల్‌ ధరలు.. రేపటి నుంచి అమలు

ఏపీ సర్కార్‌ సామాన్యులకు షాకిచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమన్నాయి. తాజాగా వాణిజ్య పన్నుల శాఖ శనివారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పెట్రోల్‌పై 31శాతం వ్యాట్‌, డీజిల్‌పై 22.75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లీటర్‌ పెట్రోల్‌పై 76 పైసలు, లీటర్‌ డీజిల్‌పై రూ.1.3పైసలు పెరగనున్నాయి. ఈ ధరలు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. కాగా, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతోనే సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it