రాత్రి నుంచి అక్కడ 20 వేల పెట్రోలు లీకైంది..!
By Newsmeter.Network Published on 27 Nov 2019 3:53 PM ISTకృష్ణా: జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామ వద్ద హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్ నుంచి పెంట్రోల్ లీకైంది. దీంతో సూమారు 20 వేల లీటర్ల పెట్రోల్ లీకైంది.అయితే మరమత్తులకు గురైన పైప్ లైన్ నుంచి పెట్రోల్ లీకవుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పెనుగంచిప్రోలు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న హెచ్‌పీసీఎల్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు అధికారులు వెంటనే పైప్‌లైన్ మరమ్మతులకు అవసరమైన యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ.. అప్పటికే రాత్రి నుంచి సూమారు 20 వేల లీటర్ల పెట్రోలు లీకైనట్లు హెచ్‌పీసీఎల్ అధికారులు గుర్తించారు.
అనంతరం పైప్‌లైన్ మరమ్మతు పనులను చేపట్టారు. ఈ మేరకు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో నందిగామ, పెనుగంచిప్రోలు రోడ్డులో ట్రాఫిక్‌ను మళ్లించారు. అంతే కాకుండా ఎవరికి ఎలాంటి హాని కలగకుండా భద్రతాపరమైన అన్ని చర్యలు చేపట్టారు. అలాగే ఘటనా స్థలంలో మంటలు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాగా.. పైపులో మిగిలిపోయిన పెట్రోలును ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా హెచ్‌పీసీఎల్ అధికారులు సేకరిస్తున్నారు.