పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు పెంచారంటూ ఢిల్లీ హైకోర్ట్‌లో పిటిషన్..!
By Newsmeter.Network Published on 9 Oct 2019 5:08 PM ISTఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై విచారణ జరిపించాలని రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు పిటిషన్ వేశారు. పిటిషన్న్నే ఫిర్యాదుగా స్వీకరించాలని కేంద్ర జలవనరుల శాఖను ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించింది. ప్రాజెక్ట్ అంచనాలు పెంచారని..ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అవకతవకలు జరిగాయని పుల్లారావు పిటిషన్ లో పేర్కొన్నారు.
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టిందనే చెప్పాలి. పాత టెండర్లను రద్దు చేసి..ఇప్పటికే రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. రివర్స్ టెండరింగ్ లో రూ.800 కోట్లకు పైగా ఆదా అయినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పోలవరం ప్రాజెక్ట్ పై పుల్లారావు వేసిన పిటిషన్ చంద్రబాబుకు ఒక రకంగా రాజకీయంగా ఇబ్బందేనని చెప్పాలి. ఢిల్లీ హైకోర్ట్ ఆ పిటిషన్ నే ఫిర్యాదుగా స్వీకరించాలని కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించడంతో..డైరక్ట్ గా కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లైంది.