బాగ్దాదిని ఎలా చంపారో చూడండి..వీడియో విడుదల చేసిన అమెరికా!

By సత్య ప్రియ  Published on  31 Oct 2019 4:49 AM GMT
బాగ్దాదిని ఎలా చంపారో చూడండి..వీడియో విడుదల చేసిన అమెరికా!

వాషింగ్టన్: ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ బగ్దాది, అక్టోబర్ 26, 2019 న అమెరికా సైన్యం చేపట్టిన ఆపరేషన్ లో మరణించాడన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఆపరేషన్ కి సంబంధించిన వీడియోలు, చిత్రాలూ అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ విడుదల చేసింది.

అమెరికా ప్రత్యేక బలగాలు నెమ్మదిగా సిరియాలో బగ్దాదీ ఉన్న ఇంటిని చుట్టుముడుతున్న సన్నివేశం ఈ వీడీయోలో చూడొచ్చు. హెలికాప్టర్ నుంచి బలగాలు దిగక ముందే ముష్కరులు హెలికాప్టర్ పై దాడి చేయగా, వారి స్థావరాలపై వైమానిక దాడులు చేయడం కూడా ఇంకో వీడియోలో కనిపిస్తుంది.



దాడికి ముందు బగ్దాది ఇల్లు ఎలా ఉంది, దాడి తరువాత ఎలా ఉంది అనే వివరాలను చిత్రాలలో చూపించారు. అక్టోబర్ 30 బుధవారం పెంటగాన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెరికా సెంట్రల్ కమాండర్ కెన్నెత్ మెకంజీ దాడికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.



టర్కీ సరిహద్దు నుంచి 4 మైళ్ల దూరంలో, ఏకాంత ప్రదేశంలో బగ్దాది ఇల్లు వుందనీ, దానిని మోహరించడానికి ముందే అమెరికా బలగాలు సిరియాలో పొంచి ఉన్నాయనీ చెప్పారు.

వైమానిక దాడులలో ఎందరు మరణించారో స్పష్టంగా తెలియలేదనీ, బలగాలు ఇంటిని మోహరించే సమయంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మహిళలూ, ఒక పురుషుడు మృతి చెందారని పేర్కొన్నారు. ఆత్మాహుతి బాంబులు ధరించిన మహిళలు సైనికుల్ని బెదిరించే ప్రయత్నం చేసారన్నారు.

Baghdadi1

బగ్దాదిని సైనికులు చేరుకునే లోపు, తనను తాను పేల్చుకున్నాడనీ, ఆ సమయంలో అక్కడ ఇద్దరు పిల్లలు కూడా అతని వద్ద ఉన్నారనీ తెలిపారు. బగ్దాది చనిపోయిన తరువాత ఇంటిని కూడా పూర్తిగా నేలమట్టం చేసినట్లు ఆయన తెలిపారు.

Baghdadi3

బగ్దాది 2004లో ఇరాక్ జైలులో ఉన్నప్పుడు, అతనీ సంబంధించిన డిఎన్ఏ ఆధారాలు సేకరించినట్లు, ఇప్పుడు దాడుల్లో దొరికిన డిఎన్ఏ తో పోల్చి చూసిన తరువాతే బగ్దాది మరణించాడని నిర్ధారించామన్నారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అతడి అవశేషాలను 24 గంటల్లో సముద్రంలో ఖననం చేశామన్నారు. ఈ దాడుల్లో ఇద్దరిని నిర్భంధించినట్టు ఆయన తెలిపారు.

Next Story