అనంతపురం: తమ పింఛన్లు తొలగిస్తే పెట్రోల్‌ పోసి తగలబెడతానని ఓ వృద్ధురాలు హల్‌చల్ చేసింది. జిల్లాలోని కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అధికారులు గ్రామంలోని అనర్హుల పింఛన్లను తొలగించారు. తొలగింపు దారులలో  ఆ వృద్ధురాలి పేరు కూడా ఉంది. దీంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనైంది.

తన పేరును ఎలా తొలగించారని అధికారులను ప్రశ్నించింది. కాగా..ప్రభుత్వం నుంచి పింఛన్‌ విడుదలైన.. అధికారులు మాకు ఇవ్వడం లేదని ఆరోపించింది. అధికారులు తనకు పింఛన్ ఇవ్వపోతే పెట్రోల్ పోసి తగలబెడతా అంటూ… బెదిరింపులకు గురిచేసింది. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.