ఆ సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు.. పాదచారులు జర జాగ్రత్త
By సుభాష్ Published on 29 Aug 2020 8:08 AM IST2019 సంవత్సరంలో రోజుకు ఒక్క పాదచారి చొప్పున హైదరాబాద్ లో ప్రాణాన్ని కోల్పోయారట. 2017-2019 మధ్య కాలంలో 602 మంది పాదచారులు ప్రాణాలను కోల్పోయారు. సగానికి పైగా(52.4%) రోడ్డు దాటుతుండగా వాహనాలు ఢీకొట్టడం వలన మరణించారని తెలుస్తోంది. మిగిలిన వారిలో కొందరు మార్కింగ్ వాక్ కు వెళుతున్న సమయంలో వాహనాలు ఢీకొట్టడం, బస్, ట్రాన్స్పోర్ట్ వాహనాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో యాక్సిడెంట్లకు గురై ప్రాణాలను కోల్పోయారు. 10 సంవత్సరాల లోపు వయసు గల 14 మంది పిల్లలు రోడ్డు పక్కన ఆడుకుంటూ ప్రమాదాలకు గురయ్యారు.
ఇంటర్సెక్షన్ ప్రాంతాలలో కంటే మిడ్-బ్లాక్ లలోనే ఎక్కువ మంది పాదచారులను వాహనాలు ఢీకొట్టాయి.
చార్మినార్ జోన్ లోని ఇన్నర్ రింగ్ రోడ్డు (చాంద్రాయణ గుట్ట క్రాస్ రోడ్స్, ఆరాంఘర్ క్రాస్ రోడ్స్), శేరిలింగంపల్లి, కూకట్ పల్లి ప్రాంతాల్లోని ఎన్.హెచ్.65 (భరత్ నగర్ నుండి మియాపూర్) ప్రాంతాలు పాదచారుల విషయంలో చాలా ప్రమాదకరంగా మారాయి.
హెవీ, కమర్షియల్ వాహనాలు (లారీలు, బస్సులు, గార్బేజ్ ట్రక్కులు, వ్యాన్స్ మొదలైన) వాహనాల కారణంగా 29 శాతం పాదచారులు మరణించారు.
ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకూ.. సాయంత్రం వేళల్లో 7 గంటల నుండి 11 గంటల వరకూ హైదరాబాద్ లో పాదచారులకు చాలా ప్రమాదకరమైన సమయమని http://footpathinitiative.org/ కథనాన్ని ప్రచురించింది.
10 సంవత్సరాల లోపు వయసు గల 14 మంది పిల్లలు రోడ్డు పక్కన ఆడుకుంటూ ప్రమాదాలకు గురైన కారణంగా పిల్లలకు ఆడుకోడానికి శ్రేయస్కరమైన ప్రాంతాలు కావాలని స్పష్టమవుతోంది.