'పెదరాయుడు'కు 25 ఏళ్లు.. వైరల్‌ అవుతున్నఅరుదైన వీడియో

By సుభాష్  Published on  15 Jun 2020 10:51 AM GMT
పెదరాయుడుకు 25 ఏళ్లు.. వైరల్‌ అవుతున్నఅరుదైన వీడియో

ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ అందులో కొన్ని ఘన విజయాలు సాధించనవి ఉంటాయి. అ విజయాలు సాధించిన సినిమాలు ఎప్పటికి గుర్తిండిపోతాయి. అలాంటి సినిమా మోహనబాబు ఖాతాలో ఉంది. ఆ సినిమానే 'పెదరాయుడు'. ఈ సినిమా మోహన్‌ బాబు కెరీర్‌ మొత్తాన్నే కాకుండా ఇండస్ట్రీలో సైతం మంచి పేరు తెచ్చింది. పెదరాయుడుకు ముందే ఇంత గొప్ప విజయం ఆయన ఖాతాలో పడలేదు. ఈ సినిమా విడుదలై నేటికి 25 ఏళ్ల పూర్తి చేసుకుంది. పెదరాయుడు ఓ రీమేక్‌ స్టోరీ. తమిళంలో విజయవంతమైన 'నట్టమై'కి తెలుగు రూపం. ఈ సినిమాని రీమేక్‌ చేయమని మోహన్‌బాబుకు సలహా ఇచ్చింది రజనీకాంత్‌. ఆయనే రీమేక్‌ రైట్స్‌ కొని మోహన్‌బాబు చేతిలో పెట్టారు. అలా మొదలైన పెదరాయుడు సినిమాలో మోహన్‌ బాబు ద్వితీయ పాత్రలో నటించారు.

ఈ సినిమా 1995 జూన్‌ 15వ తేదీన విడుదలైంది. తమిళనాట కెఎస్‌ రవికుమార్‌ డైరెక్షన్‌లో , శరత్ కుమార్ , విజయ్ కుమార్, ఖుష్బూ, మీనా తదితరులు ప్రధాన పాత్రలో నటించి 1994లో విడుదలై మంచి విజయం సాధించిన ‘నట్టమై‘ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది 'పెదరాయుడు'. రవిరాజా పిటిశెట్టి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌ఫై మోహన్‌ బాబు నటించారు. రాజాగా ద్విపాత్రాభినయం చేయగా, రజినీకాంత్‌ పోషించిన పాపారాయడు క్యారెక్టర్‌ సినిమాకు వెన్నుముకలా నిలిచింది.

సౌందర్య, భానుప్రియ, ఆనంద్‌ రాజ్‌, రాజా రవీంద్ర, బ్రహ్మనందం, జయంతి, చలపతిరావు, ఎంఎస్‌ నారాయణ, బాబు మోహన్‌, శుభశ్రీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించి ఈ సినిమాకు మంచి పేరు తీసకువచ్చారు జి. సత్యమూర్తి రాసిన మాటలు, కోటి అందించిన పాటలు, నేపధ్య సంగీతం ఇప్పటికి అలరిస్తుంటాయి. మొత్తం మీద తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

ఇక 'పెదరాయుడు' పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సంబంధించిన అరుదైన వీడియోను ప్రేక్షకులతోఎ పంచుకున్నారు మోహన్‌బాబు. ఎన్టీఆర్‌ సినిమాకు క్లాప్‌ ఇవ్వడం విశేషం. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.Next Story