తక్షణమే వారి జీతాలు చెల్లించండి
By Medi SamratPublished on : 16 Oct 2019 1:18 PM IST

ఆర్టీసి ఉద్యోగుల జీతాలపై దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. సెప్టెంబర్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లంచలేదని.. తక్షణమే 49 వేల 190 మందికి ఆర్టీసీ కార్మికులకు సంబందించి జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోరాడు.
దీనిపై ఆర్టీసీ యాజమాన్యం.. సోమవారం వరకు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని కోర్ట్ కు తెలిపింది. అలాగే.. ప్రస్తుతం సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో సిబ్బంది లేరని ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది. సోమవారం లోపు కార్మికుల వేతనాలు చెల్లించాలని హైకోర్టు ఆర్టీసీ యాజమాయ్యాన్ని ఆదేశించింది.
Next Story